calender_icon.png 27 April, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యనందించాలి

26-04-2025 01:07:17 AM

ముఖ్య అతిథి కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి 

 యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 25 ( విజయక్రాంతి ): బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడాల జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో   స్థానిక వివెర హోటల్లో  నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి  మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి శేఖర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి జగ్గు మల్లారెడ్డి, కోశాధికారి జె. శ్రీనివాస రావు, నారాయణ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పలువురు  మాట్లాడుతూ బడ్జెట్ స్కూల్ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని,  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా  నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. 

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలు మార్కుల విధానం కాకుండా గ్రేడింగ్ విధానంలోనే ప్రకటించాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి  మరలా నిర్ణయం తీసుకొని కోరారు.  బడ్జెట్ స్కూల్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు లైఫ్ ఇన్సూరెన్స్ విధానాన్ని తీసుకురావాలని తీసుకురా వాలని రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. 

అనంతరం  యాదాద్రి భువనగిరి జిల్లా బి -స్మార్ట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా మిర్యాల దుర్గాప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా చిట్టి బాబు కోశాధికారిగా ప్రభాకర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ బసవ రెడ్డి  జాయింట్ సెక్రటరీగా కోణార్క్ రావు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో  ప్రైవేటు డిగ్రీ కళాశాల రాష్ట్ర అధ్యక్షులు బొజ్జ సూర్యనారాయణ రెడ్డి,ప్రైవేట్ జూనియర్ కళాశాల అసోసియేటెడ్ ప్రెసిడెంట్ మల్లేశం, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కోశాధికారి ప్రవీణ్,వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్, యజమానులు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు.