04-04-2025 01:09:46 AM
చేగుంట, ఏప్రిల్ 3 :చేగుంట మండల పరిధిలోని వడియారం ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి రాదాకిషన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులను చదవడం, రాయడం, గణితంలో చతు ర్విధ ప్రక్రియలను గమనించి పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల రికార్డుల ను పరిశీలించి సంతృప్తి చెందారు. ఎఫ్ యల్‌ఎన్ తొలిమెట్టు కార్యక్రమంలో భాగం గా నిర్వహిస్తున్న మూల్యాంకన ఫలితాలను ఆన్లైన్లో రికార్డు చేయాలని పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు ప్రియదర్శిని అ న్నారు, ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు వసంత, సంతోషిమాత తదితరులు పాల్గొన్నారు.