calender_icon.png 16 March, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది

15-03-2025 08:43:44 PM

ఎంఈఓ..

టేకులపల్లి (విజయక్రాంతి): బాల్యం నుంచే పిల్లలు వారి భవిష్యత్తు గురించి కలలు కంటారని, ఆ కలలను సాకారం చేయాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలని టేకులపల్లి మండల విద్యాశాఖ అధికారి జగన్ అన్నారు. శనివారం బొమ్మనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఎన్నో రీతుల్లో పిల్లలు తమ భవిష్యత్తు కలలను సాకారం చేసుకునే ఆలోచనలను ఆచరణ సాధ్యం చేస్తూ, వారు ఏమి కావాలనుకుంటున్నారో ఆ ఫ్యాన్సీ డ్రస్సులను ధరించి సమావేశానికి హాజరయ్యారు. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలు తమ భవిష్యత్తు గురించి ఫ్యాన్సీ డ్రెస్సులు ధరించి చెప్పుకున్నారు. డాక్టర్ లు గా, కలెక్టర్ లు గా, టీచర్స్ గా, రైతులుగా, పోలీస్ లు గా వివిధ రంగాల్లో స్థిరపడి సమాజానికి సేవ చేస్తాము అనీ విద్యార్థులు చెప్పారు.

ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంఈఓ జగన్ మాట్లాడుతూ.. తాను కూడా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఉన్నత విద్యను అభ్యసించానని, ఉన్నత చదువులు చదివి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అన్నారు. పిల్లల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా తల్లిదండ్రులు వారికి అండగా నిలిచి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా వారిని ముందుకు నడిపించాలని సూచించారు. అప్పుడే సమాజంలో ఉత్తమ పౌరులు తయారవుతారు అన్నారు.

ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ హారిక, ప్రముఖ న్యాయవాది అడపాల మహాలక్ష్మి, టేకులపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ భాస్కర్, బొమ్మనపల్లికి చెందిన ప్రముఖ రైతు నారందాసు బిక్షమయ్యలు తమ స్వీయ అనుభవాలను, తాము జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, అయినప్పటికీ వాళ్ళు ఆయా, రంగాల్లో స్థిరపడిన తీరు తీరుతెన్నులను పిల్లలకు తల్లిదండ్రులకు విశదీకరించారు. పాఠశాల హెచ్.ఎం, ఎం.జ్యోతిరాణి సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ పొగాకు లక్ష్మి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ ఎం మంగీలాల్, టీచర్స్ జర్పల పద్మ, నీరజ షారోన్, సీఆర్పీ అబ్బయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ అంశాలలో కన్ఫర్చిన ప్రతిభకు గుర్తుగా సర్టిఫికెట్ లు బహుమతులు అందజేశారు.