calender_icon.png 4 March, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాశాఖ మంత్రిని తప్పించాలి

04-03-2025 05:34:18 PM

నిర్మల్(విజయక్రాంతి): పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జోద్పూర్ యూనివర్సిటీ(Jodhpur University)లో విద్యార్థులపై దాడి ఘటనలో సమగ్ర విచారణ జరిపి విద్యాశాఖ మంత్రిని వెంటనే తప్పించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు చనిగారపు రజినీకాంత్(SFI State Vice President Shanigarapu Rajinikanth) డిమాండ్ చేశారు. మంగళవారం నిర్మల్ లో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలో టిఎంసి గుండాలు దాడి చేయడం వల్ల విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయని దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణ చేపట్టాలని దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు దిగంబర్ శశిధర్ అభినవ్ రియాజ్ పాల్గొన్నారు.