calender_icon.png 27 January, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యనే తలరాత మారుస్తుంది

26-01-2025 01:03:00 AM

దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 

మహబూబ్‌నగర్, జనవరి 25 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరి జీవితంలో విద్య తోనే తల రాత మారుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని 10వ విద్యార్థులకు సొంత నిధులనుంచి రూ.20 లక్షలు ఖర్చు చేసి స్టడీ మెటీరియల్ తయారుచేసి అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు.

స్టడీ మెటీరియల్ ను, కోజెంట్ కంపెనీ సహకారంతో వివిధ గ్రామాల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థిని, విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు అందించిన ఈ సదుపాయాలు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. విద్యా వయసుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని స్పష్టం చేశారు.