12-04-2025 08:00:49 PM
ఏఎస్పి చిత్తరంజన్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మానవ అభ్యున్నతికి విద్య మూలమని ఏఎస్పి చిత్తారంజన్ అన్నారు. శనివారం తిర్యాణి మండలంలోని మంగి, కొలం గూడ గ్రామాలను సందర్శించారు. గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను చదివించాలని తద్వారా అభివృద్ధి చెందుతారని తెలిపారు. విద్య వైద్యం అవసరాల కోసం పోలీసులు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. నిషేధిత గంజాయి సాగును చేయవద్దని, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ లకు తెలుపాలని కోరారు. యువత మావోయిస్టుల వైపు ఆకర్షితులు కావద్దని అన్నారు. చిన్నారులతో ప్రేమగా మాట్లాడుతూ వారికి పలుకపై అక్షరాలను రాసి చదివిపించారు. పిల్లలకు పలకలు, బిస్కెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.