calender_icon.png 13 April, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతోనే ప్రపంచాన్నిజయించవచ్చు

13-04-2025 12:03:13 AM

గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ

అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సంలో పట్టాలు అందజేత

అబ్దుల్లాపూర్‌మెట్: విద్యతోనే ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని జయించవచ్చునని గవర్నర్ జిష్టుదేవ్‌వర్మ అన్నారు. అశోక గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌లో భాగమైన అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవం శనివారం చౌటుప్పల్ పరిధి తుర్పాన్‌పేట్‌లో నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరై, పీజీడీఎం విద్యార్థులకు పట్టాలు అందజేశారు. అంతకు ముందు “అనంత” పేరుతో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అశోక ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్కిటెక్చర్ విద్యా దేశానికి తలమానికంగా ఉందన్నారు. ఇరాన్ కాన్సుల్ జరల్ మహ్దీ షరోఖీ భారత విద్యా వ్యాపార సంబంధాలపై మాట్లాడారు. డెలాయిట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ శర్మ మాట్లాడుతూ... ఉద్యోగ జీవితంలో మార్గదర్శక నిబంధనలు, ఉత్తమ ప్రవర్తన, కమ్యూనికేషన్ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ చైర్మన్ అశోక్ నోముల, అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ వై. లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు.