22-04-2025 06:27:32 PM
ఐటీడీఏ పీవో రాహుల్...
భద్రాచలం (విజయక్రాంతి): అనుకున్నది సాధించాలంటే పట్టుదల, ఏకాగ్రత ప్రతి ఒక్కరు చిన్నతనం నుంచి అలవర్చుకోవాలని ఐటీడీఏ పీవో రాహుల్(ITDA PO Rahul) అన్నారు. ప్రతి విద్యార్థి మంచివారితో స్నేహం చేసుకొని, చదువు పట్ల మక్కువ చూపించి తాను అనుకున్నది సాధించాలన్నారు. మంగళవారం తన ఛాంబర్ లో అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన వాసం గాయత్రి భద్రాచలంలోని (టి టి డబ్ల్యూ ఆర్ ఎస్ & జూనియర్ కళాశాల) లో ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివి, బీటెక్ గేట్ ఎంట్రెన్స్ రాసి 32 మార్కులతో ఉత్తీర్ణత పొంది, 8300 ర్యాంకు రావడంతో బీటెక్ (AI &ML) సీట్ రావడం జరిగింది.
ప్రస్తుతం ఆ విద్యార్థిని గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాదు నందు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నా ఆమెకు ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుండి రూ.54,500 విలువగల ల్యాప్టాప్ ను అందించారు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులో అత్యుత్తమ మార్కులతో పాసై మంచి పేరు తేవాలని, మంచి ర్యాంకు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, విద్యార్థిని తల్లి లలిత తదితరులు పాల్గొన్నారు.