అభివృద్ధికి పనులకు ఎంపీ, ఎమ్మెల్యేల భూమిపూజ...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు కష్టపడే తత్వాన్ని అలవర్చుకొని ఉన్నత చదువులపై దృష్టి సారించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో, నూతన అదనపు గదులు, భవన నిర్మాణాలకు ఎంపీ గోడం నగేష్ తో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు. నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు మంచి భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.