12-04-2025 10:22:39 PM
విద్యాభివృద్ధికి తొలి ప్రాధాన్యత.!
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నేటి తరం యువత ఉన్నత శిఖరాలను తాకెందుకు విలువలతో కూడిన విద్యను తొలిమెట్టుగా భావించాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఫేర్‌వెల్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశం, సమాజం, తల్లిదండ్రుల పట్ల గౌరవం బాధ్యత కలిగి ఉన్నతమైన విద్యను పొందినప్పుడే వారు కన్న కలలను సాకారం అవుతాయాన్నారు. అందుకు తన వంతు బాధ్యతగా విద్యాభివృద్ధికి ఎల్లవేళలా తోడుంటానని హామీ ఇచ్చారు.
ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో ప్రభుత్వ పాఠశాల కళాశాల అభివృద్ధికి దోహద పడినట్లు గుర్తు చేశారు. యువత మత్తు పానీయాలు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేవరకు కృత నిశ్చయంతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారికి కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. వివిధ స్థాయిలో చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గోల్డ్, సిల్వర్ మెడల్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం. అంజయ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహమ్మద్ ఇర్ఫాన్, అధ్యాపకులు మదన్మోహన్, వనిత, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.