calender_icon.png 2 January, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితాన్ని మార్చే ఆయుధం చదువు

30-12-2024 01:55:14 AM

* ప్రతిభ గల పేద విద్యార్థులకు అండగా ఉంటా

* మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): జీవితాలను మార్చే ఆయుధం చదువు ఒక్కటేనని.. అందుకే ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేని వారికి అండగా ఉంటున్నట్టు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్థికసాయం అందించి వారు జీవితంలో స్థిరపడేందుకు సహకరిస్తామని ఆయన వెల్లడించారు. నల్లగొండకు చెందిన ప్రణవి చొల్లేటికి ఇటలీలోని ప్రఖ్యాత విద్యాసంస్థ పాలిటెన్సికో డిటోరినో (పాలిటో)లో ఆర్కిటెక్చర్ కన్‌స్ట్రక్షన్స్‌లో మాస్టర్స్ చదివేందుకు అవకాశం వచ్చింది.

అయితే ఆర్థిక స్తోమత లేనందున తనను ఆదుకోవాలని మంత్రిని కోరింది. వెంటనే స్పందించిన మంత్రి ఆదివారం ఉదయం తన నివాసానికి విద్యార్థినిని పిలిపించుకొని రూ.లక్ష ఆర్ధికసాయం అందించారు. అదేవిధంగా ఇటలీలో చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని ఆమెకు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్ధిని చదువు మధ్యలో ఆగిపోవద్దనే అండగా నిలిచానన్నారు. తమ పరిస్థితి తెలుసుకుని స్పందించిన మంత్రి కోమటిరెడ్డికి ఈ సందర్భంగా ప్రణవి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అందించిన చేయూ తతో జీవితంలో స్థిరపడి  తనలాంటి వాళ్లకు తోడుగా ఉంటానని ప్రణవి పేర్కొన్నారు.