calender_icon.png 20 January, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వాసికి ఎడ్యుకేషన్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

25-08-2024 08:02:15 PM

మంచిర్యాల,ఆగస్టు 25 (విజయక్రాంతి): జిల్లాలో 30 ఏండ్లకుపైగా విద్యా సేవలందిస్తున్న రివిలేషన్ పాఠశాల కరస్పాండెంటు రాపోలు విష్ణువర్ధన్ ఎడ్యుకేషన్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డును ఓఎంఓటీఈసీ సీఈఓ డాక్టర్ శేఖర్ జైన్, యూనివర్సల్ మెంటర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు సందీప్ గులాటి చేతుల మీదుగా అందుకున్నారు. యూనివర్సల్ మెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ది పార్క్ హోటల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది విద్యావేత్తలు పాల్గొనగా విష్ణువర్ధన్ ను ఈ అవార్డు దక్కడం అభినందనీయమని పలువురు విద్యావేత్తలు, మేధావులు, అధికారులు, పలు పాఠశాలల యాజమాన్యాలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు సాదుల మధుసూడన్ తదితరులు పాల్గొన్నారు.