19-02-2025 12:29:39 AM
తిమ్మాపూర్ ప్రిన్సిపాల్‌పై చర్యలు?
తిమ్మాపూర్, ఫిబ్రవరి 18: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్‌లో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస చారి మంగళవారం విచారణ చేపట్టారు. 10వ తరగతి పిల్లలకు స్నాక్స్ అందించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను తిమ్మాపూర్ ప్రిన్సిపాల్ నొక్కేసింది.
ఈ విషయమై ఈ నెల 12న విజయక్రాంతి దిన పత్రికలో ‘ఆరేడు బిస్కెట్లు.. పిడికెడు గుడాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ సెక్రటరీ యో రానా, కమిషనర్ డైరెక్టర్ నరసింహారెడ్డి స్పందించారు. వారి ఆదేశాల మేరకు మంగళవారం ఏడీ శ్రీనివాసచారి హైదరాబాద్ నుంచి తిమ్మాపూర్ మోడల్ స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌పై విచారణ చేపట్టారు.
విద్యార్థులకు అందిస్తున్న స్నాక్స్ గురించి టెన్త్ విద్యార్థులతో పాటు పాఠశాల టీచర్లను అడిగి తెలుసుకున్నారు. నివేదికను విద్యాశాఖ డైరెక్టర్‌కు అందజేస్తామని ఆయన స్ప చేశారు. ఈ విషయమై విజయక్రాంతి ఆరా తీయగా అసిస్టెంట్ డైరెక్టర్ సీరియస్ అవడం గమనార్హం.
తూతూ మంత్రంగా విచారణ?
విద్యాశాఖ ఏడీ శ్రీనివాసచారి తూతూ మంత్రంగా విచారణ చేపట్టి చేతు దులుపుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు వాపోతున్నారు. కేవలం విద్యార్థులను టీచర్లను విచారించారే తప్ప వంట చేసి పిల్లలకు స్నాక్ అందించే వంట ఏజెన్సీని విచారించలేదని తెలుస్తున్నది. దీంతో ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.