హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల(Government Schools)పై ప్రభుత్వానికి విద్య కమిషన్(Education Commission) నివేదిక అందించింది. తెలంగాణలోని సర్కార్ బడుల్లో అమలు చేయబడుతున్న మధ్యాహ్నం భోజన పథకంలో పలు కీలక మార్పులు చేయాల్సిం ఉందని విద్యా కమిషన్ అభిప్రాయపడింది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలలు(Government Schools), రెసిడెన్సియల్ స్కూళ్ల(Residential Schools)లో వెలుగు చూసిన పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను విద్యా కమిషన్ సందర్శించింది.
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంపై విద్య కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి(Education Commission Chairman Akunuri Murali) నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Chief Secretary Shanti Kumari)కి సమర్పించారు. సర్కార్ బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన విద్యా కమిషన్ ఆహార నాణ్యతపై పూర్తి నివేదికను అందించింది. మధ్యాహ్న భోజనం ఛార్జీలు పెంచాలని, బిల్లులను వారం వారం చెల్లించాలని విద్యా కమిషన్ సిఫార్సులు చేసింది. రెసిడెన్సియల్ స్కూళ్లలో విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని, పాఠశాలల్లోనూ మధ్యాహ్నం భోజన మెనూ పాటించాలని సూచించింది.