హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాలల్లోని స్కూ ల్ ఫీజులు, ఇతర సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు, అసోసియేషన్ నాయకులతో తెలంగాణ విద్యాకమిషన్ శుక్రవారం పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి దృష్టికి విద్యార్థుల తల్లిదండ్రులు పలు సమస్యలు తీసుకెళ్లారు.
ఫీజుల నియం త్రణకు చర్యలు తీసుకోవాలని కోరా రు. పిల్లల పుస్తకాల బరువు ఎక్కువగా ఉందని, సిలబస్ కూడా చాలా ఎక్కువగా ఉందని తెలపడంతోపాటు ఇతరత్రా సమస్యలను కమిష న్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని సమస్యలపై సలహాలు, సూచనలను కమిషన్ తీసుకుంది.
ఈ విషయాలపై ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక రూపంలో సిఫార్సులు చేయనున్నట్టు చైర్మన్ ఆకునూరి మురళి పేరెంట్స్‌తో తెలిపినట్టు సమాచారం.