calender_icon.png 21 January, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుల్లో విద్యా కమిషన్ తనిఖీలు

07-12-2024 02:33:22 AM

మధ్యాహ్న భోజనం, బోధన విధానాలపై ఆరా

ఆదిలాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): రాష్ర్ట విద్యా కమిషన్ చైర్మన్ ఆకు నూరి మురళి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం కలెక్టర్ రాజరిషా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాతో కలసి ప్రభుత పాఠశాలలను తనిఖీ చేశారు. యాపల్‌గూడ పాఠశాలలను సందరించారు. మేడిగూడ (కె) ప్రాథమిక పాఠశాలను సందరించి వంటగదిని పరిశీలించారు.

5వ తరగతి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాద్యమాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించారు. పలాయి తండా హాస్టల్‌లో విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఉట్నూర్ కే.బి కాంప్లెక్స్‌లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం అయ్యారు.

విద్యా వ్యవస్థలో అమలవుతున్న కార్యక్రమాలు, విద్యా వ్యవస్థలో చేపట్టబోయే సంస్కరణలపై అభిప్రాయాలను సేకరించారు. పాఠశాలల్లో పూర ప్రాథమిక విద్యను విలీనం చేయాలని, తరగతికి ఒక టీచర్‌ను నియమించాలని ఆకునూరి మురళి ఆదేశించారు. ఆంగ్ల మాద్యమంలోనే విద్యాబోధన జరగాలన్నారు. ఆయనవెంట ట్రైబల్ వెల్ఫేర్ డీడీ వసంతరావు జాదవ్ ఉన్నారు.