calender_icon.png 20 October, 2024 | 11:04 AM

విద్యా కమిషన్ సలహామండలి నియామకం

20-10-2024 02:23:53 AM

ఆరుగురు సభ్యులతో కమిటీ 

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ విద్యపై పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తోం ది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందస్తుగా ప్రకటించినట్లుగా విద్యాకమిషన్‌కు చైర్మన్‌ను నియమించడంతోపాటు ఈ నెల 18న ముగ్గురు సభ్యులను కూడా నియమించారు. 

తాజాగా తెలంగాణ విద్యాకమిషన్‌కు సలహాదారుల కమిటీ (అడ్వైజరీ కమిటీ)ని సైతం నియమించారు. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కమిటీ సభ్యులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జీ హరగోపాల్, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లు 

కే మురళీమనోహర్, కే వెంకటనారాయణ, శాతవాహన యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ ఎస్ సుజాత ఉన్నారు. అలాగే ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకట్‌రెడ్డితోపాటు యూనిసెఫ్ నుంచి విద్యా రంగ నిపుణులు కేఎం శేషగిరిలను అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ప్రభు త్వం నియమించింది. ఈ కమిటీ విద్యావ్యవస్థలో చేపట్టవలసిన సంస్కరణలు, కొత్త విధానాలకు సంబంధిం చి సలహాలు, సూచనలను విద్యాకమిషన్‌కు ఇవ్వనుంది. విద్యాకమిషన్‌కు చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని ఇప్పటికే నియమిం చిన విషయం తెలిసిందే.