calender_icon.png 2 February, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల భవిష్యత్తును విద్యనే మారుస్తుంది

02-02-2025 12:31:41 AM

విలువలతో కూడిన విద్య అభ్యసించండి 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి) : విద్యార్థుల భవిష్యత్తును విద్యనే మారుస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కోడూరు దగ్గర ఉన్న కేజీబీవీ పాఠశాలలో తన సొంత నిధు లతో ఇంటర్ విద్యార్దుల కోసం ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ను  ముడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్ ను, పట్టణం లోని కొనపాలముడు దగ్గర విద్యార్థి ద్వారా సమకూర్చిన టీవీని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.

విలువలతో కూడిన విద్య అభ్యసించాలని, ఉన్నత శిఖరాలను అధిరో హించాలని కోరారు. విద్యార్థులకు అవసర మైన సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పిం చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొ న్నారు. 

కలెక్టర్‌కు చెక్కుల అందజేసిన ఎమ్మెల్యే

ప్రభుత్వ పాఠశాలలో వివిధ సౌకర్యాల ను కల్పించేందుకుగాను విద్యానిధి ద్వారా విరాళాలు సేకరిస్తున్న విషయం విధితమే. ఈ క్రమంలో జనవరిలో దాతల నుంచి వచ్చేసిన మొత్తం సుమారు రూ 8 లక్షల 50 వేల రూపాయలు వచ్చాయని, శనివారం 3 లక్షల 37 రూపాయలు విద్యా నిధి కి సంబంధించిన చెక్కులను కలెక్టర్ విజయేం దిర బోయి  నీ కలెక్టరేట్లో కలిసి దాతల సమక్షంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెక్కులను అందజేశారు.

ఈ నెల 6- 9 వ తేది వరకు విశాఖపట్నంలో జరగనున్న అంతర్జా తీయ ఓపెన్ కరాటే పోటీలకు జిల్లా విద్యా ర్థులు పోతున్నారని వారి ఖర్చులు నిమిత్తం రూ 25 వేల  లను అందిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో కేజి విబి కళాశాల ప్రిన్సిపాల్ సువర్ణ, ఎంఇఓ కష్ణయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాద వ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, దాతలు తదితరులు ఉన్నారు.