భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలోని మండల విద్యాధికారులు విద్యాసంబంధమైన అన్ని నివేదికలను సకాలంలో అందజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆనంద ఖని, మండల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా శాఖ ప్రగతిని తెలియజేసే ప్రతీ రిపోర్ట్ ను ఇచ్చిన గడువులో పూర్తి అయ్యేలా భాద్యత వహించి, మండలంలోని ప్రతీ పాఠశాల ప్రధానోపాధ్యాయులచే అప్డేట్ చేసే విధంగా మండల విద్యాధికారులు చూడాలని సూచించారు. ఇకముందు ప్రతీ సోమవారం మండల స్థాయిలో అన్ని రిపోర్ట్ లను అప్డేట్ చేసుకొని జిల్లాకు సబ్మిట్ చేయాలని సూచించారు.
రివ్యూ నిర్వహించిన అంశాలు...
ముఖ్యంగా U DISE+ లో విద్యార్థుల వివరాలు అప్డేట్ చేయడం, పాఠశాలలో మౌళిక వసతుల ను పారదర్శకంగా నమోదు అయ్యేలా చూడటం వల్ల, పాఠశాలలకు ప్రభుత్వం ద్వారా రావలసిన అన్ని రకాల సదుపాయాలు సకాలంలో కల్పించబడతాయని అన్నారు.
అదేవిధంగా ప్రతీ విద్యార్థి కి U DISE+ లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, APAAR ID జెనరేట్ చేయాలని అన్నారు.
FRS అటెండెన్స్ ను ప్రతీ పాఠశాలలో నమోదు చేసేలా తగు చర్యలు తీసుకోవలన్నారు.
స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్ (ISMS )లో యూనిఫాం డేటాను అప్డేట్ చేయాలని , పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (PTM ) రిపోర్ట్ లను స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్ అదే రోజు అప్డేట్ చేయాలి.
ప్రశస్త్ యాప్ ద్వారా విద్యార్థులను స్క్రీనింగ్ చేసి రిపోర్ట్ అప్డేట్ చేయడం, విద్యాంజలి పోర్టల్ అన్ని పాఠశాలలను రిజిస్ట్రేషన్ చేసి అప్డేట్ చేయడము
మధ్యాహ్న భోజనంలో మెనూ పాటిస్తూ, నాణ్యత కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలి.
డిసెంబర్ 3న జరిగే NAS పరీక్ష విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు.
పై అన్ని విషయాల పై మండలం వారీగా రివ్యూ చేసి, ప్రతి వారం మండలం వారిగా ప్రోగ్రెస్ తనకు తెలియజేయాలని అన్నారు. ఈ రివ్యూలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరచారి, ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, జిల్లా సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ సైదులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.