హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విద్య, సంక్షేమ శాఖల కార్యదర్శులు శుక్రవారం కలిశారు. విద్యార్థులకు డైల్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పోషకాహరంలో మార్పులు-చేర్పులు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.
పది రోజుల్లో కొత్త డైట్ ను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పెంచిన డైట్, కాస్మోటిక్ ఛార్జీలతో 7,65,705 మంది విద్యార్థినీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని సీఎం పేర్కొన్నారు. దీపావళి పండుగ శుభ సందర్బంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (#TREIS) పరిధిలోని విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే.