calender_icon.png 1 October, 2024 | 7:07 PM

విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యం

01-10-2024 12:16:38 AM

  1. మంత్రి జూపల్లి కృష్ణారావు
  2. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష 

నిజామాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు జి ల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జిల్లా అభివృద్ధిపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. అర్హులైన రైతులందరికీ రుణమా ఫీ చేస్తామని తెలిపారు.

వరి ధాన్యం దిగుబడిని దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో ధాన్య ం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. జి ల్లాలో పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కా లేజీగా అప్‌గ్రేడ్ చేస్తామని మంత్రి చెప్పారు. మోర్తాడ్, భీంగల్, ఆర్మూర్ ఎక్సైజ్ స్టేషన్‌ల భవనాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రా రంభించారు.

కార్యక్రమంలో బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్, ఆ ర్మూర్ ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర ఉర్డూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర వి త్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, బాల్కొ ండ కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రె డ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి పాల్గొన్నారు.