calender_icon.png 22 September, 2024 | 7:59 AM

రైతు భరోసాపై ప్రజలకు వివరించండి

22-09-2024 01:32:12 AM

స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యంగా సమావేశాలు

ప్రారంభమైన కాంగ్రెస్ సమీక్షలు

పార్టీ పటిష్టతపై నేతలకు దిశానిర్దేశం 

వెల్లడించిన పార్టీ అగ్రనేతలు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): వచ్చే సీజన్ నుంచి ఇచ్చే రైతు భరోసాపై ప్రజలకు వివరించాలని జిల్లాల నాయకులు పార్టీ రాష్ట్ర అగ్రనేతలు సూచించారు. శనివారం గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  అధ్యక్షతన మూడు జిల్లాల సమీక్ష సమావేశాలు జరిగాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సమావేశాలు నిర్వహించారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, ఇన్‌చార్జ్ కార్యదర్శి విశ్వనాథన్ పాల్గొని జిల్లాలోని పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

ప్రధానంగా ఎమ్మె ల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్‌లు, అనుబంధ సంఘాల రాష్ర్ట అధ్యక్షులు, జాతీయ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. మంత్రులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు పాల్గొని నాయకులతో పార్టీ విషయాలను చర్చించారు. వరంగల్ నుంచి మంత్రి కొండా సురేఖ, ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదా రు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కావ్య, తదితరు లు పాల్గొన్నారు.

కరీంనగర్ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మం త్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎంపీ వంశీ కృష్ణ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సమావేశంలోఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎంపీ సురేశ్ షెట్కార్, తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధా నంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పని తీరు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా చర్యలు, ప్రతిపక్షపార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడం లాంటి అంశాలపై చర్చించారు.

గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టండి: ఎంపీ మల్లు రవి

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టేలా, ప్రభు త్వం చేసిన సేవలను ప్రజలకు వివరించేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పనిచేయాలని జిల్లాల సమావేశంలో నిర్ణయించినట్లు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి తెలిపారు. సమావేశాల్లో చర్చించిన అంశాలపై ఆయన మీడియా కు వివరించారు. రైతు భరోసా రూ. 15 వేలను వచ్చే పంట నుంచి ఇవ్వనున్నామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవలసిన అం శాలని చర్చ జరిగిందని మల్లు రవి తెలిపారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేసిం దన్నారు.   రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ భారీ విజయం సాధించేందుకు పని చేయాలని నిర్ణయించి నట్లు వెల్లడించారు. పార్టీలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వయం చేసే బాధ్యత ఇన్‌చార్జి మంత్రి తీసుకుంటారని  తెలిపారు.