calender_icon.png 19 February, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల సేవలు నిరంతర ప్రక్రియ, ప్రజలు సహకరించాలి

15-02-2025 06:30:51 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్త రేషన్ కార్డుల సేవలు నిరంతర ప్రక్రియకు ప్రజలు సహకరించాలని ఈడీఎం సైదేశ్వర రావు(EDM Saideshwara Rao) అన్నారు. ఈఎస్డి కమిషనర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(Collector Jitesh V. Patil) ఆదేశాల మేరకు కొత్తగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డ్ సేవ, మీ సేవ కేంద్రాల పనితీరును పరిశీలించేందుకు శనివారం ఈ డిస్టిక్ మేనేజర్ సైదేశ్వరరావు, టీజీటీఎస్ డిఎం రఘు పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని మీసేవ కేంద్రాలను ఆకస్మికంగా  తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వారు మీసేవ ఆపరేటర్లందరూ వివిధ అవసరాల కోసం మీసేవ కేంద్రాలకు వచ్చే ప్రజల వద్ద నుండి అదనపు రుసుములు వసూలు చేయకూడదని, మీసేవ కేంద్రానికి వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. ఎవరైనా నిర్ణీత రుసుము కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు మీసేవ కేంద్రాలలో ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1100 కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వారు మీ సేవ కేంద్రాల్లో ప్రజలతో కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డుల్లో సవరణలు నిరంతర ప్రక్రియ అని అందరూ సహకరించాలని కోరారు.