calender_icon.png 23 October, 2024 | 3:23 AM

కమల ఇంటర్వ్యూ ను ఎడిట్ చేశారు

23-10-2024 12:27:29 AM

సీబీఎస్ నెటవర్క్‌పై దావే వేస్తా: ట్రంప్

వాషింగ్టన్, అక్టోబర్ 22: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడు తుండడంతో డెమాక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్య ర్థి డొనాల్‌డ్ ట్రంప్‌లు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుం టూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమం లో అక్టోబర్ 7వ తేదీన కమలతో చేసిన ఇంటర్వ్యూను సీబీఎన్ నెట్‌వర్క్ ఎడిట్ చేసి ఆమెకు అనుకూలంగా ప్రసారం చేసిందని ట్రంప్ ఆరోపించారు.

ఆ ఇంటర్వ్యూలో ఆమెను అడిగిన ఒకే ప్రశ్నకు రెండు వేర్వేరు సమాధానాలను ప్రసారం చేశారంటూ ట్రంప్ మండిపడ్డారు. ఓటర్లను గందరగోళంలో పడేయడానికే  ఇంటర్వ్యూ చేసి ఓటర్లను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. హారిస్‌ను తెలివైన వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేశారని విమర్శించారు.

  ఇంటర్వ్యూలో ఏం మార్చా రో అమెరికన్ల అందరికీ తెలియాలని, ఆమె ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఫైర్ అయ్యారు.  సీబీఎన్ నెట్‌వర్క్ పై దావా వేస్తానని ట్రంప్ హెచ్చరించారు.  కమల ఇంటర్వ్యూను ఆమెకు అనుగుణంగా మార్చి ఓటర్లను ఆమె వైపు తిప్పేలా సీబీఎన్ ప్రయత్నించిందని ఆరోపణలు వస్తున్నాయి.