calender_icon.png 19 April, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 129ని సవరించండి

19-04-2025 01:02:31 AM

గ్రామపాలన అధికారుల జేఏసీ విజ్ఞప్తి 

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం రైతులకు చుట్టమని తెలంగాణ విలేజ్ రెవెన్యూ అధికారుల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, ప్రధాన కార్యదర్శులు హరాలే సుధాకర్‌రావు, పల్లెపాటి నరేశన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మెరుగైన చట్టం తీసుకొచ్చిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీల అమలులో గ్రామ పాలకులు పాత్ర ఎం తో కీలకమన్నారు. భూభారతి చ ట్టం అమలు బాధ్యత కూడా తమదేనని చెప్పారు. 129 జీవోను సవరిం చాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. 129 జీవో సవరణ వల్లప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేదన్నారు.