calender_icon.png 19 April, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడా

18-04-2025 12:53:30 AM

  1. రూ.793 కోట్ల దాల్మియా సిమెంట్స్ ఆస్తులు అటాచ్
  2. వైఎస్ హయాంలో కడపలో అక్రమంగా గనులను లీజుకు పొందిన దాల్మియా సిమెంట్స్

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్ర మాస్తుల కేసులో ఈడీ మరోసారి కొరడా ఝుళిపించింది. దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ.793 కోట్ల విలువైన భూమిని ఈడీ అటాచ్ చేసింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను అప్పటి వైఎస్ ప్రభుత్వం దాల్మియాకు లీజుకిచ్చింది.

ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐ గతంలోనే ఆరోపించింది. జగన్‌తో కలిసి దాల్మియా సిమెంట్స్ అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొం దినట్టు సీబీఐ 2013 ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దీని ద్వారా జగన్ రూ.150 కోట్ల అక్రమ లబ్ధి పొందినట్టు అందులో పేర్కొం ది.

రఘురామ సిమెంట్స్‌లో రూ.95 కోట్ల విలువైన షేర్లు, రూ.55 కోట్లు హవాలా రూ పంలో దాల్మియా సిమెంట్స్‌కు ఇచ్చినట్టు అభియోగం మోపింది. సీబీఐ ఛార్జ్‌షీట్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా ఈ రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.