calender_icon.png 4 January, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్ములా రేస్ కేసు నేటి నుంచి ఈడీ ప్రత్యక్ష విచారణ

02-01-2025 01:55:42 AM

  1. విచారణకు హాజరుకానున్న ఐఏఎస్ అధికారి అర్వింద్
  2. రేపు మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డి
  3. 7న కేటీఆర్ హాజరు: సర్వత్రా ఉత్కంఠ

హైదరాబాద్,జనవరి 1(విజయక్రాంతి): ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో గురువారం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యక్ష విచారణ చేపట్టనుంది. నిబంధనలకు విరుద్ధంగా రూ. 55 కోట్లను విదేశీ కంపెనీకి చెల్లించారనే అం శంపై ఈడీ కేసు నమోదుచేసి ఇప్పటికే వాటికి సంబంధించిన ఆధారా లను స్వాధీనం చేసుకుంది.

బ్యాం కులు, హెచ్‌ఎండీఏ నుంచి అవసరమైన పత్రాలను సేకరించింది. గురువారం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, శుక్రవారం హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిలను విచారించనుంది. వీరి విచారణ తర్వా త ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ నెల 7న విచారణకు పిలువనుంది.

ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణలో ఈడీ... ఏ అంశాలను సేకరిస్తుం ది, ఆయన ఏం వాంగ్మూలం ఇస్తారనే దాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఎల్‌ఎన్ రెడ్డి విచారణ ముగిసిన తర్వాత ఈ కేసులో కేటీఆర్‌ను ఈడీ విచారిస్తుంది. చాలా సందర్భాల్లో ఈడీ విచారణకు పిలిచి అరెస్టు చేసిన ఉదాహరణలున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇరువురు అధికారుల విచారణపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు కేటీఆర్ న్యాయవాదులు హైకోర్టులో వాదిస్తున్నంత సులభంగా ఈ కేసు వ్యవహారమేమీ లేదని.. డబ్బు బదలాయిం పు నిబంధనలకు విరుద్ధంగా ఉండటం అనే ది కీలకమైన విషయంగా తెలుస్తోంది.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పుతో ఈడీకి సంబంధం లేదని.. ఈడీ తన విచారణ తాను చేసుకుపోతుందని తెలుస్తోంది. ఓవైపు ఏసీబీ కేసు, మరోవైపు ఈడీ కేసు ఒకేసారి చుట్టుముట్టడంతో కేటీఆర్‌కు ఊపిరిసలపని విధంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.