calender_icon.png 26 December, 2024 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడా కాలేజీలపై ఈడీ నిఘా

26-12-2024 04:20:45 AM

  • అమెరికాలోకి భారతీయుల అక్రమ రవాణా
  • మనీ లాండరింగ్ కేసులపై దర్యాప్తు

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: కెనడా సరిహద్దుల నుంచి అమెరికాలోకి భారతీయులను అక్రమంగా తరలించేందుకు సంబంధించి డబ్బులు చేతులు మారిన మనీ లాండరింగ్ కేసులపై ఈడీ దర్యాప్తు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కెనడాలోని కొన్ని కాలేజీలు, భా రత సంస్థల పాత్రపై విచారణ చేపట్టినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. 2022 జనవరి 19న గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం కెన డా సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న సమయంలో తీవ్రమైన శీతల గాలుల కారణంగా మరణించారు.

ఈ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపడుతుం ది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భవేశ్ పటేల్‌తో పాటు మరికొందరిపైనా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. నిందితులు మానవులను అక్రమంగా తరలించే సంస్థల తో కలిసి భారతీయులకు మాయమాటలు చెప్పి వారిని సరిహద్దులు దాటిస్తున్నట్లు అ ధికారులు వెల్లడించారు.  కెనడా మీదుగా అమెరికాకు అక్రమంగా పం పుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో ఒక్కో వ్యక్తి నుంచి రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేసినట్లు వెల్లడించారు.