calender_icon.png 8 January, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు

07-01-2025 03:43:10 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో జనవరి 7న విచారణకు హాజరుకాలని ఏజెన్సీ కోరింది. కానీ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు(Formula E-Car Racing Case)లో కేటీఆర్ ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే క్వాష్ పిటిషన్(Quash Petition) కోర్టులో పెండింగ్ లో ఉన్నందున ఈడీ విచారణను వాయిదా వేయాలని కేటీఆర్ అభ్యర్థించారు. కేటీఆర్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో జనవరి 16వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ జారీ చేసిన కొత్త నోటీసులో పేర్కొంది. దీనిపై కేటీఆర్ తన న్యాయవాద బృందంతో సంప్రదించి తదుపరి చర్యను నిర్ణయిస్తారని సమచారం.