calender_icon.png 6 November, 2024 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఆర్డీవోకు ఈడీ సమన్లు

06-11-2024 02:28:27 AM

  1. రంగారెడ్డి భూదాన్ భూముల బదిలీలో రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం
  2. ఇప్పటికే ఐఏఎస్ అమోయ్‌కుమార్‌తోపాటు తహసీల్దార్ జ్యోతిని విచారించిన ఈడీ

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా నాగారంలోని భూదాన్ భూముల బదిలీల్లో అక్రమా లు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో పలువురు అధికారులను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా అప్పటి ఆర్డీవో వెంకటాచారికి సమన్లు జారీచేసింది.

ఈ నెల ౭న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ప్రస్తుత పశుసంవర్థకశాఖ జాయింట్ సెక్రటరీ అమో య్‌కుమార్ వందల కోట్ల రూపాయల విలువైన 42 ఎకరాల భూమిని అక్రమంగా బది లీ చేశారనే అభియోగాల నేపథ్యంలో ఇటీవలే ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 181, 182 లోని 102.2 ఎకరాల భూమిపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఇందులో 42 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని బోర్డు వాదిస్తోంది. కాగా, ఈ భూమి జబ్బర్దస్త ఖా న్ అనే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ అయి ఉంది.

తరువాత కాలంలో జబ్బర్దస్త ఖాన్ కొడుకు హజీఖాన్ అందులోని 42 ఎకరాల ల్యాం డ్‌ను భూదాన్ బోర్డుకు దానం చేశారు. అయితే 2021లో హజీఖాన్ వారసురాలినంటూ 42 ఎకరాలు తనదేనని ఖాదురు న్నీసా అనే మహిళ దరఖాస్తు చేసింది. దీంతో ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో, తహసీల్దార్, ఆరైలు, సీనియర్ అసిస్టెంట్ ఆమెకి అనుకూలంగా పని చేసినట్టు విచారణలో బయటపడింది. 

రియల్ ఎస్టేట్ కంపెనీకి విక్రయం

౪౨ ఎకరాల భూమిని అధికారులు ఆగమేఘాల మీద దరఖాస్తురాలికి కట్టబెట్టగా.. ఆ భూమిని రియల్ ఎస్టేట్ కం పెనీకి అమ్మకాలు చేసినట్టు విచారణలో తేలింది. ఎన్నికల సమయంలో ఈ భూమికి సంబంధించి భారీగా ఫిర్యాదు లు వెల్లువెత్తాయి. దీంతో ఈ భూమి పై క్రయవిక్రయాలు జరగకుండా అధికారు లు ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టా రు. ఈ వ్యవహారంపై గతేడాది మార్చి 13న మెహిదీపట్నంకు చెందిన దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.  

2021 అక్టోబర్‌లో వారసత్వ హక్కు లు మార్చేందుకు, రెవెన్యూ రికార్డులు తారుమారు చేసేందుకు, ఆస్తి పాస్‌బుక్‌లు జారీ చేసేందుకు నిందితులు కుట్రపన్నారని, 42 ఎకరాల భూమికి నకిలీ సేల్ డీడ్‌లు సృష్టిం చి పాస్‌బుక్‌లు జారీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణ జరపాలని కోర్టు మహేశ్వరం పోలీసులను ఆదేశించింది.

విచా రణ జరిపిన పోలీసులు ఎమ్మార్వో జ్యోతితోపాటు బొబ్బిలి దామోదర్‌రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్‌రెడ్డి, ఎన్ సంతోష్‌కుమార్, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి సహా పలు వురిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరగడంతో మొదట విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణ ఆధారంగా ఈడీ రంగం లోకి దిగింది. తాజాగా ఈ వ్యవహారంపై విచారించేందుకు ఈడీ అధికారులు అప్పటి ఆర్డీవో వెంకటాచారిని విచారణకు పిలిచారు. 

ఈ 42 ఎకరాల భూమి తారు మారు కావడం వెనక ఎవరున్నారు? ఆ భూ ములు మార్చాలని ఎవరు చెప్పారు? అనే అంశాలపై ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.