calender_icon.png 27 November, 2024 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్యపై ఈడీ విచారణ చేయాలె

27-08-2024 01:57:28 AM

పీడీఎస్‌యూ నేతలు 

ఖమ్మంలో ఉద్రిక్తత

ఖమ్మం, ఆగస్టు 26 (విజయక్రాంతి): అక్రమాలకు పాల్పడుతున్న శ్రీ చైతన్య వి ద్యా సంస్థలపై ఈడీ, సీఐడీ చేత విచారణ జ రిపించాలని పీడీఎస్‌యూ నేతలు డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సోమవా రం ఖమ్మంలో  సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఉద్రికత్త చోటు చేసుకుంది.  పోలీసులు రం గ ప్రవేశం చేసి, ఆందోళనకారులను చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ సం దర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మ ధ్య కొద్దిసేపు వాగ్వావాదం, తోపులాట జరిగింది. అనంతరం వారిని బలవంతంగా పో లీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థ నగరంలో అధిక ఫీజులు వసూలు చేస్తూ చట్ట ఉల్లంఘన చేసి, పలు అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రీచైతన్య పాఠశాలలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు ని యంత్రణలో లేకపోవడంతో పాటు విద్యా హక్కు చట్టాన్ని  అమలు చేయడం లేదన్నా రు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నారని అన్నారు. ఫి ట్‌నెస్ లేని బస్సులు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆరోపించా రు. సంస్థ అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నట్లు వెల్లడించారు. రెండు రో జుల్లో విద్యాశాఖ స్పందించకపోతే పెద్ద ఎత్తు న ఆందోళన నిర్వహిస్తామని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు సాగర్, రామకృష్ణ, గోపి,అజయ్, వినోద్, అనూష తదితరులు పాల్గొన్నారు.