మార్టిన్ ఆస్తులపై దాడులు
చెన్నై, నవంబర్ 14: మనీలాండరింగ్ కేసులో భాగంగా చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఆస్తులపై గురువారం ఈడీ దాడులు చేపట్టింది. మార్టిన్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. రూ.1,300 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలుచేసి.. రాజకీయపార్టీలకు అత్యధిక మొత్తం లో విరాళాలు ఇచ్చిన వ్యక్తిగా మార్టిన్ పేరు ఇటీవల దేశమంతటా మారుమోగింది. అలాగే సిక్కిం ప్రభుత్వానికి రూ.900 కోట్లు నష్టం కలిగించినందుకుగాను గతేడాది మార్టిన్‌కు చెందిన రూ.450కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఈ క్రమంలో చెన్నైలోని మార్టిన్ నివాసంలో లభించిన రూ. 7.20 కోట్ల్ల నగదు పట్టివేతకు సంబంధించిన కేసును మూసివేయాలన్న తమిళనాడు పోలీసుల అభ్యర్థనను దిగువ కోర్టు అంగీకరించిన నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది.