- ఈ నెల 8,9 న విచారణకు రావాల్సిందే..
- గడువుకోరిన అధికారులకు ఈడీ నోటీసులు
- ఏ-3 బీఎల్‌ఎన్‌రెడ్డి గైర్హాజరు
- నేడు హాజరవ్వాల్సిఉండగా.. సమయం కోరిన అర్వింద్
- 7న కేటీఆర్‌ను విచారణకు పిలిచిన ఈడీ
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి) : ఫార్ములా ఈ-రేస్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ పెం చింది. విచారణకు హాజరుకాకుండా గడువు కోరిన అధికారులకు మనోసా రి నోటీసులు జారీచేసింది. ఈ నెల 8,9 తేదీల్లో కచ్చితంగా హాజరుకావాలని ఏ-2 ఐఏఎస్ అధికారి అర్వింద్‌కు మా ర్, ఏ-3 హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డికి స్పష్టంచేసిం ది.
వీరిద్దరూ విచారణకు హాజరయ్యేందుకు 2, 3 వారాల గడువు కోరారు. అయితే, ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నహెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి గైర్హాజరయ్యా రు. మరికొంత సమయం కావాలని ఈడీ అధికారులను ఆయన కోరారు. జనవరి 3న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ సైతం హాజరు కావాల్సిఉండ గా, ఆయన కూడా సమయం కావాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు.
వీరిద్దరి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ఈడీ అడిగినంత సమయం ఇవ్వకుండా ఈ నెల 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. మరో వైపు ఈ నెల 7న విచారణకు హాజరుకావాల్సిందిగా ఏ-౧ మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులిచ్చింది. అయితే బీఎల్‌ఎన్‌రెడ్డి, అర్వింద్‌కుమార్ విచారణకు డుమ్మా కొట్టిన నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది.
ఏసీబీ కేసు నమోదుపై కేటీఆర్ హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేయగా ఊరట లభించిన విషయం తెలిసిందే. మొదటి రెండుసార్లు జరిగిన విచారణలో గత ఏడాది డిసెంబర్ 31 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశిస్తూ తీర్పు రిజర్వు చేసింది.
కాగా, హైదరాబాద్‌లో ఈ నిర్వహణకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థలకు నేరుగా రూ.45.71 కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఘటనపై ఈడీ ఆరా తీస్తోంది. ఏసీబీలో నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తోంది.