calender_icon.png 29 April, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాతబస్తీలో ఈడీ సోదాలు

29-04-2025 01:05:30 AM

భూదాన్ భూముల వ్యవహారం..

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : హైదరాబాద్ పాత బస్తీలోని యాకుత్‌పురా, సంతోష్‌నగర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున నాలు గు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు, భూదాన్ భూముల వ్యవహారంలో ఈ సోదాలు జరుపుతు న్నారు. మహేశ్వరం భూముల విషయంలో తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా పాతబస్తీలోని మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నీస్, సర్ఫాన్, సుకూర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఈఐపీఎల్ కంపెనీ భూ ములు విక్రయించింది. ఈఐపీఎల్ కంపెనీకి సుకూర్ బినామీగా ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే గతంలో రంగారెడ్డి కలెక్టర్‌గా ఉన్న అమోయ్‌కుమార్, మహే శ్వరం తహసీల్దార్‌ను ఈడీ విచారించింది.