calender_icon.png 28 October, 2024 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో ఈడీ సోదాలు

01-08-2024 01:35:20 AM

పలు కీలక పత్రాలు, దస్త్రాలు స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): నగరంలో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపాయి. మహేశ్  కోఆపరేటివ్ బ్యాంకులో బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. అనర్హులకు రుణాలు మంజూరు చేశారన్న ఆరోపణలపై ఈడీ విచారణ కొనసాగిస్తున్నది. సిటీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ అధికారులు నగరంలోని మహేశ్  కోఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించిన 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మహేష్ బ్యాంకు చైర్మన్ రమేష్‌కుమార్, ఎండీ పురుషోత్తం దాస్‌తో పాటు సీఈవో డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు జరుగుతున్నాయి. సోలిపురం వెంకట్‌రెడ్డితో పాటు వారి పిల్లలు, సోదరుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. 

అయితే బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్లుగా ఈడీ గుర్తించింది. రూ.300 కోట్ల నిధుల గోల్‌మాల్‌పై నమోదైన కేసు నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. పలు కీలక పత్రాలు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.