calender_icon.png 30 November, 2024 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్‌కుంద్రా నివాసంపై ఈడీ దాడులు

30-11-2024 12:50:50 AM

అశ్లీల చిత్రాలను 1.2 మిలియన్ డాలర్లకు విక్రయించినట్టు ఆరోపణలు

ముంబై, నవంబర్ 29: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా నివాసంపై ఈడీ అధికారులు దాడులు చేశారు. పోర్న్ నెట్‌వర్క్ ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డార నే కేసులో ముంబైలోని ఆయన నివాసం, కార్యాలయాల్లో  సోదాలు నిర్వహించారు. కుంద్రాతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారి ఇళ్లపై కూడా ఈడీ అధికారులు దాడు లు చేశారు.

షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తామని నమ్మబలికి కొంతమంది మోడల్స్‌తో బలవంతగా అశ్లీల చిత్రాలు తీశారని కుంద్రాపై ఆరోపణలున్న విషయం తెలిసిందే. అలా తీసిన అశ్లీ ల చిత్రాలను కుంద్రా తనకు సంబంధించిన యాప్‌లో అప్‌లోడ్ చేసి భారీగా ఆర్జించిన ట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజ్‌కుంద్రా ప్రధాన పాత్ర పోషించినట్టు ఈడీ అధికారులు గు  ర్తించి కొన్ని రోజులుగా ఆయనపై నిఘా ఉం చారు.

ఈ క్రమంలోనే ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని 15 ప్రాంతాల్లో తాజాగా ఈడీ సోదా లు నిర్వహించింది. అయితే ఈ సోదాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ప్రకటించ లేదు. కాగా 119 అశ్లీల చిత్రాలను దాదాపు 1.2 మిలియన డాలర్లకు కుంద్రా విక్రయించినట్టు పోలీసులు పేర్కొన్నారు. కుంద్రా వాట్సప్ చాట్‌లో ఈ  వివరాలను గుర్తించినట్టు పేర్కొన్నారు.