calender_icon.png 19 April, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూరానా గ్రూప్‌పై ఈడీ దాడులు

17-04-2025 01:56:58 AM

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి):  నగరంలోని సురానా, సాయి సూర్య డెవలపర్స్‌లో బుధవారం ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో సురానా గ్రూప్ చైైర్మ న్, ఎండీ డైరెక్టర్ ఇళ్ల్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నైకి చెంది న ప్రముఖ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు రూ. 3,986 కోట్లను ఎగ్గొట్టిన కేసులో ఆ గ్రూప్‌పై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది.

2021 ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగిన ఈడీ సోదాల్లో రూ.11. 62 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు. కంపెనీకి చెందిన ఇద్దరు ప్రమోటర్లు, సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపైనా పీఎంఎల్‌ఏ కేసు నమోదైంది. తాజా దాడుల్లో సురానా, సాయి సూర్య మధ్యన ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది.