నిజామాబాద్ జిల్లా వెల్పూర్ వజ్రా ఇండస్ట్రీస్‌లో పట్టుబడిన రేషన్ బియ్యం
- వజ్రా ఇండస్ట్రీస్‌లో 560 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- ఉమ్మడి జిల్లాలో రేషన్ దందా గుట్టురట్టు
- కామారెడ్డి, నవంబర్ 8 (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం దందా నిర్వహిస్తున్న రైస్‌మిల్లును గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికా రులు శుక్రవారం మెరుపుదాడి నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వెల్పూర్‌లోని వజ్రా ఇండస్ట్రీస్‌లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారనే సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. రైస్‌మిల్లులో నిల్వ ఉంచిన 560 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- ఉమ్మడి జిల్లాలో ప్రతి నెల గుట్టు చప్పుడు కాకుండా లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. అధికారులకు తెలిసి కూడా బియ్యం స్మగ్లర్లు ఇస్తున్న మాముళ్లకు ఆశపడి రేషన్‌బియ్యం దందాను పట్టించు కోవడం లేదు.
- రాష్ట్ర సివిల్ సప్లు ప్రిన్సిపాల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటనలో ఉన్న సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. గతంలో కూడా ఇదే రైస్‌మిల్‌లో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడింది. గత రెండు నెలల క్రితం ఇదే జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలోని రైస్‌మిల్లులో రెండు లారీల రేషన్ బియ్యం పట్టుబడిన విషయం విధితమే.