17-04-2025 11:22:56 PM
బెంగళూరు: బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి రూ. 50 కోట్లతో ఓ వోల్ఫ్ డాగ్‌ను కొనుగోలు చేసినట్టు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది. తాను అరుదైన జాతి కుక్కను రూ. 50 కోట్లకు కొనుగోలు చేసినట్టు సతీష్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. దీని తర్వాత ఈడీ సతీష్‌పై కంప్లుంట్ ఫైల్ చేసింది. ఈ కొనుగోలు హవాలా మనీ హస్తం ఉందా? లేదా ఏవైనా అక్రమమార్గాల్లో సంపాదించిన సొమ్ముతో ఈ కొనుగోలు జరిపారా అని ఈడీ దర్యాప్తు చేస్తోంది. కుక్కతో పాటు విచారణకు హాజరుకావాలని ఈడీ సతీష్‌కు నోటీసులివ్వగా.. కుక్క ప్రస్తుతం తన స్నేహితుడి వద్ద ఉందంటూ సతీష్ చెబుతున్నాడు.