calender_icon.png 23 April, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27న రండి..

23-04-2025 01:27:48 AM

  1. హీరో మహేశ్‌బాబుకు ఈడీ నోటీసులు
  2. బ్రాండ్ ప్రమోషన్ పారితోషికాలపై ఆరా!

హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రముఖ తెలుగు నటుడు మహేశ్ బాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొ న్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలైన సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కంపెనీలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థల కేసు లకు  సంబంధించే ఆయనకు ఈడీ నోటీసులిచ్చింది.

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద మొత్తంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేశ్ బాబు ఆ రెండు కంపెనీల నుంచి పారితోషకంగా రూ. 5.9 కోట్లు తీసుకున్నారు. ఇందులో రూ. 3.4 కోట్లు చెక్ రూపంలో తీసుకోగా.. మరో 2.5 కోట్లు నగదు రూపంలో తీసుకున్నాడని వినికిడి.

అయితే నగదు రూపంలో తీసు కున్న ఈ డబ్బు విషయంలోనే ఈడీ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఏమైనా మనీలాం డరింగ్ కోణం ఉందా? అనే విష యం తేల్చేందుకే ఈడీ మహేశ్ బా బుకు నోటీసులు జారీ చేసినట్టు స మాచారం. ఈ సంస్థల్లో పలు సందేహాత్మక లావాదేవీలు జరిగినట్టు ఇప్పటికే ఈడీకి ఆధారాలు లభించాయని.. మహేశ్ బాబుకు చెల్లించిన పారితోషకంలో ఏమైనా మనీలాండరింగ్ కుంభకోణం ఉందా అని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.