calender_icon.png 20 October, 2024 | 5:29 AM

రంగారెడ్డి మాజీ కలెక్టర్‌కు ఈడీ నోటీసులు

20-10-2024 02:58:49 AM

23 లేదా 24వ తేదీల్లో విచారణకు రావాలె

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీ సులు జారీ చేసింది. ఈ నెల 23 లేదా 24వ తేదీల్లో విచారణకు హాజ రు కావాలని నోటీసుల్లో తెలిపింది.

బీఆర్‌ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా  కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్ హయాంలో పెద్ద ఎత్తున జరిగిన భూ కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నా యి.

ప్రభుత్వ భూములను సైతం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను ఈడీ విచారణకు పిలిచినట్లుగా సమాచారం. ఓ ఐఏఎస్ అధికారిని ఈడీ విచారణకు పిలిపించడంతో అధికారుల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 

గతంలోనే బండి ఆరోపణలు..

నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సహా పలువురు జిల్లా కలెక్టర్ల అవినీతిపై గతంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఆ నలుగురు కలెక్టర్లు ధరణి పేరుతో అడ్డగోలుగా సంపాదించి వేల కోట్లు కేసీఆర్‌కు దోచిపెట్టారని గతంలో బండి ఆరోపించారు.

ఆ నలుగురు కలెక్టర్ల అవినీతిపై నివేదిక రూపొందించాలని గతంలోనే ఆయన చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో అమోయ్ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడం విశేషం.