calender_icon.png 30 November, 2024 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీజీ మెడికల్ సీట్ల స్కాం ౩ కాలేజీలపై ఈడీ కొరడా

30-11-2024 01:56:57 AM

  1. మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్ల అమ్మకాలు
  2. 5.34 కోట్ల విలువైన ఆస్తుల జప్తు

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): కొన్ని కాలేజీలు పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేయడంతో పాటు వాటిని అక్రమంగా మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కింద కేటాయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో రూ. 5.34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

చల్మెడ ఆనందరావు కళాశాలకు చెందిన రూ.3.33 కోట్లు, ఎంఎన్‌ఆర్ కళాశాలకు చెందిన రూ.2.01 కోట్లను ఈడీ సీజ్ చేసింది. కొందరు వ్యక్తులు, ఏజెన్సీలు, పలువురు నీట్ విద్యార్థులతో కలిసి రాష్ట్రంలోని పలు ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోని పీజీ సీట్లను బ్లాక్ చేస్తున్నారని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ వరంగల్‌లోని మట్టెవాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దర్యాప్తులో భాగంగా గతేడా ది జూన్‌లో తెలంగాణలోని 16 చోట్ల ఈడీ సోదాలు చేసింది. మల్లారెడ్డి కళాశాలలో చేపట్టిన సోదాల్లో రూ. 1.04 కోట్లను స్వాధీనం చేసుకుంది. బ్యాంకు ఖాతాల్లోని రూ.2.89 కోట్లను ఈడీ నిలుపుదల చేసింది.