calender_icon.png 12 January, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడీ కట్టు కథలు చెబుతోంది

11-07-2024 01:36:05 AM

  1. నా అరెస్టు ముమ్మాటికీ అక్రమం
  2. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన సీఎం కేజ్రీవాల్
  3. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్న ఈడీ
  4. విచారణను జూలై 15కి వాయిదా వేసిన కోర్టు

న్యూ ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కో ర్టు బెయిల్ మంజూరు చేయగా.. దానిని రద్దు చేయాలని కోరుతూ ఈడీ అధికారులు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచరాణను హైకో ర్టు  జూలై 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి మరింత సమయం ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది హైకోర్టును కోరగా.. న్యాయ స్థానం జూలై 15వ తేడీ వరకు సమయం ఇస్తూ విచారణను వాయిదావేసింది. కాగా లిక్కర్ స్కాం కేసు లో మార్చి 21న సీఎం కేజ్రీవాల్‌ను అరె స్టు చేయగా జూన్ 20న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్‌పై ఈడీ హైకోర్టును ఆశ్రయించగా.. బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది.

కట్టు కథలు చెబుతోంది..

కాగా తన బెయిల్ కేసు విచారణకు రాకుండా ఈడీ కట్టు కథలు చెబుతోంది అని సీఎం కేజ్రీవాల్ హైకోర్టుకు తెలిపారు. కౌంటర్ ధాఖలు చేయడానికి మరింత సమయం ఎందుకు అని ప్రశ్నించారు. తనపై తప్పుడు కేసు బనాయిం చిన ఈడీ తనను శాశ్వతంగా జైలులో ఉంచాలని చూస్తోందని.. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని త్వరలోనే నిర్దోషిగా జైలునుంచి బయటకు వస్తానని దీమా వ్యక్తం చేశారు.