calender_icon.png 2 November, 2024 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిక్కర్ కేసులో నిందితురాలిగా కవిత

11-05-2024 12:05:00 AM

ఢిల్లీ కోర్టులో ఈడీ చార్జ్‌షీట్ 

ఢిల్లీ, మే 10: మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే కవితను నిందితురాలిగా పేర్కొంటూ ఢిల్లీ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొత్త చార్జ్‌షీట్ దాఖలు చేసింది. పీఎంఎల్‌ఏకు సంబంధించి సెక్షన్ 45, సెక్షన్ 44(1)లను నమోదు చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తాజాగా ఆరో చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అంతేకాకుండా మొత్తం 18 మందిని అరెస్ట్ చేసింది. వచ్చేవారం ఏడో చార్జ్‌షీట్ సైతం దాఖలు చేయాలని భావిస్తోంది. ఈ చార్జ్‌షీట్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పైనా ఇవే సెక్షన్లను నమోదు చేసే అవకాశమున్నట్లు ఓ జాతీయ వార్తాసంస్థ నివేదించింది. అయితే, ఏడో చార్జ్‌షీట్ దాఖలు తర్వాత ఈడీ వాదనలను మే 13న కోర్టు విచారించ నుంది. కాగా, 2022 ఆగస్టులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ కేసులో ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఈ ఏడాది మార్చి 15న కవితను, మార్చి 21 కేజ్రీవాల్‌ను అదుపు లోకి తీసుకున్నారు. కాగా, శుక్రవారం కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.