calender_icon.png 24 December, 2024 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రౌడీషీటర్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

19-10-2024 02:00:37 AM

మహ్మద్ కైసర్‌కు చెందిన రూ. కోటి విలువైన ఆస్తుల అటాచ్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : రాష్ట్రంలోనే మొదటిసారిగా రౌడీషీటర్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. హబీబ్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ మహ్మద్ కైసర్ జేబు దొంగగా జీవితాన్ని మొదలు పెట్టి.. ఇప్పుడు పేరుమోసిన రౌడీ షీటర్‌గా భారీగా ఆస్తులు కూడబెట్టాడు.

పలు సెటిల్‌మెంట్లు, నేరాల్లో వచ్చిన డబ్బులను హవాలా మార్గంలో కైసర్ స్వీకరించినట్లు ఈడీ గుర్తించింది.  అలాగే ఆయన భార్య షాహెదా బేగం పేరు మీద అనేక స్థిరాస్తులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో శుక్రవారం మహ్మద్ కైసర్‌కు చెందిన సుమారు రూ. కోటి విలువ చేసే ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేసిన ట్లు పేర్కొన్నారు.

2007 నుంచి ఇప్పటివరకు హత్య, హత్యాయత్నం, దోపిడీ, జూదం, క్రికెట్ బెట్టింగ్, ల్యాండ్ సెటిల్‌మెంట్ వంటి అనేక నేరాల్లో మహ్మద్ కైసర్ ప్రమేయం ఉంది. 2011లో సంవత్సరంపాటు నగర బహిష్కరణకు కూడా గురయ్యాడు. మహ్మద్ కైసర్‌పై క్రిమినల్ రికార్డ్ ఉంది. అతనిపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.