calender_icon.png 24 December, 2024 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ రుణాల కేసులో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

31-07-2024 07:20:36 PM

హైదరాబాద్: అక్రమ రుణాల కేసులో ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. వెంకటరామ్మోహన్ రావుకు చెందిన రూ.19.11 కోట్ల ఆస్తులు అటాయి చేసిన ఈడీ వాటి మార్కెట్ విలువ సుమారుగా రూ.71.61 కోట్లు ఉంటుందని వెల్లడించింది. గతంలో వెంకటరామ్మోహన్ రావు ఐడీబీఐ వద్ద అక్రమంగా రూ.311 కోట్లు రుణాలు తీసుకున్నట్లు గుర్తించింది. ఈ కేసులో వెంకటరామ్మోహన్ సహా 11 మంది నిందితులు బ్యాంక్ అధికారులతో కలిసి ఫోర్జరీ దస్త్రాలతో రుణాలు తీసుకున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు తెలిపారు. వీరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.