15-04-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): గ్యాంగ్ స్టార్ నయీమ్ కేసుల్లో ఈడి దూకుడుగా వ్యవహరించడానికి సమాయత్తం అవుతుంది. భువనగిరి పట్టణానికి చెందిన క్రిస్టియన్ గాస్పల్ మిషనరీ చర్చ్ కార్యదర్శి ఫిర్యాదుతో కదలిక మొదలయింది. గత ప్రభుత్వం నయీమ్ అక్రమ ఆస్తులపై వేసిన సిట్ ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అనేక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించి 250 కేసులు నమోదు చేశారు.
1993 నుంచి 2016 వరకు దాదాపు 23 ఏళ్ల పాటు నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని తన అనుచరులతో హత్యలకు, కబ్జాలకు, బెదిరింపులకు, కిడ్నాప్లకు పాల్పడి వేలకోట్ల ఆస్తులను, నగదును దోచుకున్నాడు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్. నిర్ధారణలో లెక్కలేనన్ని సెటిల్మెంట్లు, భూ అక్రమాలు, 40 కి పైగా హత్యలు, కిరాతకమైన చర్యలు, 1000 ఎకరాలకు పైగా భూ కబ్జాలు.
దాదాపు 1,50,000 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు, 29 పక్క భవనాలు, 2.8 కోట్ల రూపాయల నగదును నయీమ్ దోచుకున్నట్లు అప్పట్లో సిట్ ప్రకటించింది. నయీమ్ చెందిన అక్రమ ఆస్తులు రెండు వేల కోట్లు ఉన్నట్లుగా సిట్ వెల్లడించిన నేపథ్యంలో ఇన్కమ్ టాక్స్, ఇన్ఫోసిమెంట్ డైరెక్టర్. ఈడి రంగంలోకి దిగింది. ఇన్కమ్ టాక్స్ అధికారులు.
నోటీసులు జారీ చేశారు. షిఫ్ట్ గుర్తించిన వాటిలో 35 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కుటుంబ సభ్యులు సన్నిహితులు అక్రమంగా బలవంతంగా తుపాకీ గురిపెట్టి బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తులపై అప్పట్లో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఎల్బీనగర్ హైదరాబాదులోని ప్రత్యేక హోటలు కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో భువనగిరి పట్టణంలో గల క్రిస్టియన్ గాస్పల్ మిషనరీ సెక్రెటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడిలో కదిలిక వచ్చి ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కేసులో ఏ వన్ నయి మృతిచెందగా, ఏ2 హసీనా బేగం, ఏ3, మహమ్మద్ తహేర బేగం, ఏ4 సలీమా బేగం, ఏ5 మొహమ్మద్ అబ్దుల్ సలీం, ఏ9 మహమ్మద్ ఆరిఫ్, ఎ10 హీనా కౌసర్, ఫరీదా అంజు లపై కేసు నమోదు అయ్యాయి.
నయీమ్ ప్రధానాంచరుడు పాశం సీన్ తో పాటు ఇతర అనుచరులు అక్రమ ఆస్తులను గుట్టు చప్పుడు కాకుండా ఇతరులకు అమ్ముకుంటున్నట్లు ఇడికి ఫిర్యాదులు రావడంతో ఏడు కోట్ల విలువ కలిగిన 35 ఆస్తులపై ఈ డి నోటీసులు జారీ చేసింది. ఈడి కోరిన విధంగా నాన్ బేలబుల్ వారెంట్లు జారీ చేసి అరెస్టు చేయాలని ఈడి యోచిస్తుంది.
నయీం పాత అనుచరులు తిరిగి బెదిరింపులకు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసిన నేపథ్యంలో రాచకొండ కమిషనర్ వారందరినీ పిలిచి హెచ్చరించినట్టు తెలిసింది. నయీమ్ ఆగడాలు అతని కను సైగల్లో జరిగేటివి. విద్యార్థి దశలో పిడిఎస్యు విద్యార్థి సంఘంలో పనిచేస్తూ అప్పటి ఆలేరు గల కమాండర్ సత్యం ఆధ్వర్యంలో పీపుల్స్ వార్ లో చేరాడు.
దళ సభ్యుడిగా కొనసాగుతూ యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో పోలీసులపై బాంబు వేసి జైలుకి వెళ్ళాడు. చంచల్గూడా జైల్లో ఉన్నప్పుడు పోలీసులు కోవర్టుగా మారి నక్సలైట్లను, దలనాయకులను, పౌర హక్కుల నాయకుల ను అతని అనుచరులతో హత్యలు చేయిస్తూ పోలీస్ ఉన్నతాధికారుల తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు.
వారి అండదండలతో నేర సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటూ కరుడుగట్టిన గ్యాంగ్ స్టార్ గా మారి హడాలెత్తించాడు. మాజీ నక్సలైట్లకు డబ్బు ఆశ చూపి తన వైపు తిప్పుకొని హత్యలు చేయించేవాడు. తన గ్యాంగ్ లో పనిచేసే అనుచరులకు అక్రమ ఆస్తులను కట్టబెట్టాడు. ఆయన పేరు చెప్పుకొని అనుచరులు అనేక దందాలకు పాల్పడి కోట్ల రూపాయల భూములను కబ్జాలు చేశారు.
తనకు ఎదురు తిరిగిన వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిసిన అనుచరులైన కఠినంగా కిరాతకంగా హత్యలు చేసిన సంఘటనలు ఉన్నాయి. భువనగిరి పట్టణం నుండి ప్రారంభమైన ఆయన నేరాలు ఉమ్మడి నల్లగొండ, హైదరాబాదు నగరం, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం, అదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, దాదాపు తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపజేశాడు.
అంతటితోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, గోవా, చతిస్గడ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట లలో సైతం అనుచరులను ఏర్పాటు చేసుకొని తన నేర సామ్రాజ్యాన్ని కొనసాగించాడు. మొదట్లో పోలీసు ఉన్నతాధికారుల మద్దతుతో తన నేర సామ్రాజ్యాన్ని ప్రారంభించుకున్న నయీమ్ ఆ డిపార్ట్మెంట్ కి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు.
రాష్ర్టస్థాయి నాయకులని కాకుండా జాతీయస్థాయి నాయకులను, బడా వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్ మృతి చెందాడు.