calender_icon.png 8 November, 2024 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రిగోల్డ్ కేసులో ఈడీ అదనపు ఛార్జిషీట్

08-11-2024 12:00:00 AM

పరిగణనలోకి తీసుకున్న కోర్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి): అగ్రిగోల్డ్ కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అదనపు ఛార్జిషీట్‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మొత్తం 32 లక్షల ఖాతాదారుల నుంచి అగ్రిగోల్డ్ సంస్థ రూ. 6,380 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్‌లో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన రూ. 4,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ఇప్పటికే ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు అవ్వా వెంకట రామారావు, అవ్వా వెంకట శేషునారాయణరావు, అవ్వా హేమసుందర వరప్రసాద్ పేర్లతో పాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపైనా ఈడీ బుధవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ మేరకు గురువారం ఈడీ ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.