calender_icon.png 16 April, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు వేగవంతం

16-04-2025 09:16:04 AM

హైదరాబాద్: గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) విచారణ వేగవంతం చేసింది. పశుసంవర్ధకశాఖ ఏడీ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. గొర్రెల పంపిణీలో రూ. 700 కోట్లు అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో గతంలో పలువురిని అరెస్ట్ చేసిన ఏసీబీ రిమాండ్ కు తరలించింది. ఏసీబీ(Anti-Corruption Bureau) కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ ను నమోదు చేసింది. గొర్రెల పంపినీ కేసు పూర్తి వివరాలు ఇప్పటికే ఈడీ వద్ద ఉన్నాయి.  గొర్రెల పంపిణీ పథకం, తెలంగాణ రాష్ట్రంలోని యాదవ, కురుమ వర్గాలకు చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వం నుండి సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే పథకం. తొలి విడతలో 5,064.42 కోట్ల రూపాయలతో 3.93 లక్షల మందికి 82.64 లక్షలు గొర్రెలు పంపిణీ చేయబడ్డాయి.

2017, జూన్ 20న సిద్ధిపేట జిల్లా, గజ్వేల్ సమీపంలోని కొండపాకలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) ఈ పథకాన్ని ప్రారంభించారు. కొండపాక మండలంలోని 825 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను (ఇందులో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుంది) అందజేశాడు. మొదటి విడతలో యూనిట్‌కు 1.25 లక్షల ఖర్చులో ప్రభుత్వం 75శాతం, లబ్ధిదారుడు 25శాతం ఖర్చు భరించాల్సివుంటుంది. గొల్ల, కురమ వర్గాల వారు తమ సాంప్రదాయ వృత్తులలో సాధికారత సాధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతమవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రారంభించబడింది. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (టిఎస్‌ఎస్‌జిడిసిఎఫ్) ఆధ్వర్యంలో ఈ పథకం అమలు చేయబడింది.