calender_icon.png 18 January, 2025 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికవరీ బాటలో ఆర్థిక వ్యవస్థ

18-01-2025 01:49:09 AM

ఆర్బీఐ బులెటిన్

ముంబై, జనవరి 17: దేశీయ డిమాండ్ పటిష్టత కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిబాట పడుతుందని  రిజర్వ్‌బ్యాంక్ జనవరి బులెటిన్‌లో అంచనా వేసింది.2025 సంవత్సం అవుట్‌లుక్‌ను ఆర్బీఐ బులెటిన్‌లో వివరిస్తూ వివిధ దేశాల ఆర్థిక వ్యవ స్థలు విభిన్నంగా ఉన్నాయని, యూఎస్‌లో వృద్ధి వేగం తగ్గగా, యూరప్, జపాన్‌ల్లో రికవరీ బలహీనంగా ఉంటుందని, వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థల పనితీరు ఓమోస్తరుగా ఉంటుందని పేర్కొంది. 

భారత్‌లో వృద్ధి సంకేతాలు

భారత్‌లో ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న సంకేతాలు కన్పిస్తున్నాయని, ఈ కాలంలో వాస్తవ జీడీపీ వృద్ధిని సూచిస్తూ ఎన్‌ఎస్‌వో తొలి వార్షిక అడ్వాన్స్ ఎస్టిమేట్స్‌ను వెల్లడించిందని ఆర్బీఐ బులెటిన్ వివరించింది. ప్రధాన  ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెల డిసెంబర్‌లోనూ తగ్గిందని పేర్కొంది.

ఆహార ద్రవ్యోల్బణం మాత్రం గరిష్ఠస్థాయిలోనే ఉన్నందున, దానిని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖల్ పాత్ర నేతృత్వంలో బృందం బులెటిన్‌లో ప్రచురించిన ఆర్టికల్‌లో సూచించింది.

వ్యవసాయ రంగం మెరుగైన పనితీరుతో వినియోగం స్థిరంగా ఉండటం జీడీపీ వృద్ధికి దోహదపడుతుందని, ప్రభుత్వ మూలధన పెట్టుబడులు కీలక రంగాల్ని పునరుత్తేజితం చేస్తాయని ఆర్టికల్ పేర్కొన్నది.  అయితేతయారీ రంగానికి పెరుగుతున్న ముడి వ్యయాలు, వాతావరణ సంబంధిత సమస్యలు వృద్ధిని ఆటంకపర్చవచ్చని హెచ్చరించింది.